బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ఆది పూజలు అందుకునే గణనాథుడిపై కొంత మంది భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో కోటి 51 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బొప్పా మోరియా.. గణేషుడి పండగ వచ్చిందంటే గల్లీ గల్లీకి వినపడే స్లోగన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేషుడు అంటే స్పెషల్. ఎందుకంటే అక్కడ ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటాడు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ జరుపుకోవడంపై సందిగ్ధత కొనసాగుతుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చే అంశంపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా డైలామాలో పడ్డాయి.
Khairatabad Ganesh: వినాయక ఉత్సవాల మొదటి రోజే, హైదరాబాద్ నగరంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా బీజేపీ కార్య కర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు, రాజాసింగ్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటుచేసేకుంది, నిరసనకారులను అరెస్టు చేసి, రాంగోపాల్ పేట్ ఠాణాకు తరలించారు. ఇవాళ ఖైరతాబాద్…
Karnataka HC allows Ganesh festivities at Hubballi edgah: వినాయక చవితి ముందు కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు జరుపుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అర్థరాత్రి ఈ కేసును విచారించిన ఈ కోర్టు హుబ్బళ్లి-ధార్వాడ్ ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అంతకు ముందు బెంగళూర్ ఈద్గాలో గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ తీర్పు…
Bengaluru Idgah Maidan Case- Supreme Court: బెంగళూరులోని ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వివాదానికి దారి తీసింది. కర్ణాటక వక్ఫ్ బోర్డు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ కేసులు ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. అంతకుముందు రోజు ఈ కేసులు విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో న్యాయమూర్తులు పరస్పరం విభేదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రస్తుతం ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం వినాయక చతుర్థి పండగ ప్రారంభం…