Bandi Sanjay: గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా నేనే చెల్లిస్తా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేశ్ మండప నిర్వాకులారా…. నవరాత్రి దీక్షలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.
Read also: Gabbar Singh Re-Release: గబ్బర్ సింగ్ సక్సెస్‌ను ఆయన ముందే ఊహించారు: హరీశ్ శంకర్
నేను ఉదాహరణ….30 ఏళ్లుగా నిత్యం భగవంతుడిని పూజిస్తున్నా అన్నారు. గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా నేనే చెల్లిస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గణేష్ మండపాలకయ్యే కరెంట్ కేవలం కీరంనగర్ వాసులకు మాత్రమే అని తెలుస్తుంది. మండప నిర్వాహకులను విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం రోజే కాకుండా 9 రోజులపాటు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రత్యేకంగాట అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకుందామని తెలిపారు. కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదామన్నారు.
Kriti Kharbanda : మతి పోగొడుతున్న కృతి అందాలు