Litton Das Celebrated Ganesh Chaturthi: ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వినాయక చవితిని శనివారం నాడు అంగరంగ వైభవంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అనేక దేశాలలో హిందూ మతంలో ఉన్నవారు గణేష్ చతుర్థిని జరుపుకున్నారు. ఈ మధ్యకాలంలో విదేశీయులు కూడా కొందరు హిందూ తత్వాన్ని ఇష్టపడి హిందూ సంస్కృతిని పాటిస్తున్నారు. కొన్ని దేశాలలో అయితే ఏకంగా కొందరు శాస్త్రాలు నేర్చుకుని పురోహితం కూడా చేస్తున్నారంటే నమ్మండి. ఇకపోతే అన్య మతస్తులైన కొందరు హీరోలు కూడా వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం ఇదివరకు మనం చూసాం. ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ బడా హీరోలైన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి నటులు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న దృశ్యాలు మీడియాలో చాలానే చూసాము. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ కూడా చేరాడు. అతను వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు.
Ajit Doval: రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం మాస్కోకు వెళ్లనున్న అజిత్ దోవల్.?
వినాయక చవితి సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కి క్యాప్షన్ గా గణపతి బప్పా మోరియా అంటూ రాసుకోవచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.