రేపు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం జరగబోతున్నది. ఈ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గణపయ్యలను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. శనివారం అర్థరాత్రి నుంచి నగరంలో అంతర్రాష్ట్ర, జిల్లాల నుంచి వచ్చే లారీలపై నిషేదం అమలుచేశారు. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సులను రూట్‌లను మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్…
ఖైరతాబాద్ గణపయ్యను దర్శించేందుకు వందలాది మంది భక్తులు నిత్యం వస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా 40 అడుగుల ఎత్తైన మహా గణపతిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణపయ్యకు మొదటిసారి తలపాగను ఏర్పాటు చేశారు. తలపాగతో ఖైరతాబాద్ గణపయ్యకు కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. బాహుబలి సినిమాలు తలపాగలు తయారు చేసిన చార్మినార్‌కు చెందిన బృందం మహాగణపతికి తలపాగను తయారు చేశారు. 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉండే విధంగా మహాగణపతికి తలపాగను తయారుచేశారు. ఈ తలపాగతో…
గణేష్ చతుర్థి సందర్భంగా నగరంలో భారీ గణనాథులను ఏర్పాటుచేశారు. మూడో రోజు నుంచి గణపతుల నిమర్జన కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఈరోజున నిమర్జనం కావాల్సిన విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందని, హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం హౌస్…
హైదరాబాద్‌లో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన వందలాది గణపతి మండపాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమర్జనానికి అనుమతిని నిరాకరిస్తూ ఈ నోటీలుసు ఇచ్చిరు. హైకోర్టు ఆదేశాలతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై రేపు తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను…
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.. ఇక, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య… తదితరులు పాల్గొన్నారు.…
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. పలువురు సినీ ప్రముఖులు చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మట్టితో చేసిన వినాయకుడికి భార్యతో కలిసి పూజలు చేశారు. మరోవైపు, సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పారు. ఈ కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని…
ఖైరతాబాద్‌లో భారీ గణపతి కొలువుదీరిన కారణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. గణపయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వీలైనంత వరకు ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా మెట్రో లేదా పబ్లిక్ వాహనాల్లో రావాలని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఖైరతాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతించడంలేదు. లక్డీకపూల్‌లోని రాజ్‌దూత్ మీదుగా వచ్చే వాహనాలను మార్కెట్ వైపుకు మళ్లిస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు ఐమాక్స్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు…
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. హిందువులకు ఇది తొలి పండుగ. ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముంబై, హైదరాబాద్ తరువాత బెంగళూరు నగరంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలపై కరోనా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే, బెంగళూరు నగరంలో వినాయక…
ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై వివాదం నడుస్తూనే ఉంది.. ఈ విషయంలో ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు.. వైఎస్ వర్ధంతికి, స్కూళ్లకు, బార్లకు లేని కరోనా.. వినాయక ఉత్సవాలు నిర్వహిస్తేనే వస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇక, వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ విశాఖలో మౌనదీక్ష చేపట్టారు.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశ్వ హిందూ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మౌన దీక్షకు కూర్చుకున్నారు.. వినాయకుడి విగ్రహానికి నల్ల రిబ్బన్ కట్టి..…