ఖైరతాబాద్‌లో భారీ గణపతి కొలువుదీరిన కారణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. గణపయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వీలైనంత వరకు ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా మెట్రో లేదా పబ్లిక్ వాహనాల్లో రావాలని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఖైరతాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతించడంలేదు. లక్డీకపూల్‌లోని రాజ్‌దూత్ మీదుగా వచ్చే వాహనాలను మార్కెట్ వైపుకు మళ్లిస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు ఐమాక్స్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక వృద్దుల కోసమైతే వాహనాలను మింట్ కాంపౌండ్ లో పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక ఎప్పటిలాగే ద్విచక్ర వాహనాల కోసం అనేక చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Read: రివ్యూ: లాభం (తమిళ డబ్బింగ్)