గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు కూడా వాన ఆటంకంగా మారింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డులు దెబ్బతినడంతో.. గణేష్ నిమజ్జనానికి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ అంతా సోభాయమానంగా మారింది. నిమజ్జనానికి వచ్చే భక్తులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసింది. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్…
khaki Ganpati In Mumbai: వినాయక చవితి వేడుకల్లో వివిధ రుపాల్లో గణనాథుడు కొలువవుతున్నాడు. భక్తులు తమకు నచ్చిన స్టైల్‌లో వినాయకులను ప్రతిష్టించారు. ఇటీవల పుష్ఫ రాజ్ తరహాలో తగ్గేదే లేదనే స్టైల్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం చూశాం. తాజాగా ముంబై పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఓ వైపు భక్తితో పాటు ప్రజలకు సందేశాన్ని ఇచ్చే విధంగా ‘‘ ఖాకీ గణపతి’’ని ప్రతిష్టించారు.
Ganesh Chaturthi: వినాయక చవితి సందర్భంగా పలువురు రకరకాల డిజైన్‌లలో గణేష్ ప్రతిమలను తయారు చేస్తున్నారు. గతంలో గబ్బర్‌సింగ్, RRR, బాహుబలి, స్పైడర్‌మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో విక్రయానికి వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ స్టైలులో ఉన్న వినాయకుడు కూడా మార్కెట్లోకి వచ్చేశాడు. పుష్పలో సూపర్‌హిట్ డైలాగ్ ‘తగ్గేదే లే’ స్టిల్‌లో ఈ వినాయకుడిని తయారు చేయగా ఈ గణేష్ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్…
వినాయక చవితి వచ్చేస్తోంది.. ఇప్పటికే వినాయక మండపాలు, ఏర్పాట్లు, వినాయక విగ్రహాల కొనుగోళ్లపై దృష్టిసారించారు భక్తులు.. అయితే, మండపాల ఏర్పాట్లకు పర్మిషన్ తప్పనిసరి అంటున్నారు పోలీసులు.. అయితే, హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి పందిళ్లపై పోలీసుల కర్ర పెత్తనం చేయాలనుకుంటోంది.. ఇది తగదు అంటున్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు అధికారి ఒక్కో విధంగా వినాయక మండపాల నిర్వాహకులకు ఉత్తర్వులిస్తున్నారు.. ప్రభుత్వం ఉత్సవ కమిటీలతో దాగుడు మూతలు…