హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. హిందువులకు ఇది తొలి పండుగ. ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముంబై, హైదరాబాద్ తరువాత బెంగళూరు నగరంలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలపై కరోనా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే, బెంగళూరు నగరంలో వినాయక చవితి పండుగ సందర్బంగా బెంగళూరు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో వినాయక చవితి రోజున మాంసం విక్రయాలపై నిషేదం విధించింది. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించినా, జంతువులను వధించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది బెంగళూరు నగరపాలక సంస్థ.