ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆస్పత్రిని సందర్శించి పేషెంట్లు, అటెండెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్పత్రిలో డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీసులు, నర్సింగ్ విభాగంలో కొరతలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు.
సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు.
Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Damodara Raja Narasimha : తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూన్ 2న జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ స్పందించారు. మొత్తం 92 మంది రోగులు అస్వస్థతకు గురవగా, వారిలో 18 మందిని తీవ్రంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా సహా ఇతర ఆసుపత్రుల్లో ఏర్పాటు…
Bandi Sanjay : ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన…
Fire Crackers Blast: నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమం అనంతరం జరిగిన బాణసంచా పేల్చడంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్‌లో బాణసంచా పేల్చేందుకు రెండు బోట్లలో బాణసంచా సామగ్రిని తీసుకెళ్లారు. టపాసులు పేల్చడం క్రమంలో, నిప్పు…
Kidney Racket: హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై పోలీసులు తీవ్రమైన దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నీ రాకెట్ లో పాలుపంచుకున్న అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పాల్గొన్న వైద్యుల కోసం కూడా విచారిస్తున్నారు. ఈ దందా ఎంతకాలంగా కొనసాగుతుందో? ఇప్పటివరకు ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారో అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తిసుకున్నారు పోలీసులు. హాస్పిటల్ నిర్వాహకుడు సంపత్‌తో పాటు మరికొంత మంది…
Hyderabad: హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం మూడు అంతస్తుల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో “శుభనందిని చిట్ ఫండ్” బోర్డు తొలగించే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి నాచారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫాగ్ ద్వారా…
Damodara Raja Narasmiha : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పేదవాని వైద్యం,…