Damodara Raja Narasimha : తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూన్ 2న జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ స్పందించారు. మొత్తం 92 మంది రోగులు అస్వస్థతకు గురవగా, వారిలో 18 మందిని తీవ్రంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా సహా ఇతర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆరు వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.
CM Chandrababu: ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు.. నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు!
ఈ ఘటనపై మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ, ఫుడ్ పాయిజన్ కు కారణంగా ఆసుపత్రిలో అందించిన డైయట్ ఆహారమే అని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అదనంగా అందించిన స్వీట్ కూడా అనారోగ్యానికి కారణమైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం మెరుగవుతోందనీ, ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వారు రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పారు.
ఈ ఘటనకు కారణమైన డైయట్‌ను పర్యవేక్షించే కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగా లేనందున అతని కాంట్రాక్టును రద్దు చేసినట్టు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో ఘటనపై సమగ్ర విచారణ కోసం ఒక ప్రత్యేక కమిటీని నియమించామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
ఇక ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిన వ్యక్తి కరణ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి కోణంలో ఈ ఘటనపై ఆందోళన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Good Wife : ఏకంగా ఏడు భాషల్లో ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..