Bandi Sanjay : ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ సభ్యులు అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ యువతికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బండి సంజయ్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డికి ఫోన్ చేసి వెంటనే సదరు యువతిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని సూచించారు. బండి సంజయ్ సూచన మేరకు డాక్టర్ శిల్పారెడ్డి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి వెళ్లి అఫ్రోజ్ ను యశద ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని తరలించే విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారంటూ శిల్పారెడ్డి వాపోయారు.
Betting Apps: షారుఖ్‌ఖాన్, సచిన్, కోహ్లీలపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు ?