Kidney Racket: హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై పోలీసులు తీవ్రమైన దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నీ రాకెట్ లో పాలుపంచుకున్న అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో పాల్గొన్న వైద్యుల కోసం కూడా విచారిస్తున్నారు. ఈ దందా ఎంతకాలంగా కొనసాగుతుందో? ఇప్పటివరకు ఎంతమందికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారో అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తిసుకున్నారు పోలీసులు. హాస్పిటల్ నిర్వాహకుడు సంపత్‌తో పాటు మరికొంత మంది సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. దళారుల నుండి సమాచారం తీసుకుంటున్న పోలీసులు, ఇతర నిందితులను గుర్తించడం కోసం అనేక దర్యాప్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దళారులు, హాస్పిటల్ మేనేజ్మెంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Yuzwendra Chahal vs BCCI: బీసీసీఐ తీరుతో యూజీ కెరీర్ ముగిసిపోయినట్లే: ఆకాశ్ చోప్రా
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు కిడ్నీ రిసీవర్లతో పాటు కిడ్నీ డోనర్లను కూడా పోలీసులు విచారించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు కిడ్నీ రిసీవర్లు నస్రీన్, ఫిర్దోజ్ బేగంలతో పాటు కర్ణాటకకు చెందిన కిడ్నీ డోనర్లు రాజశేఖర్, కృపాలతలను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారు ఇచ్చే స్టేట్‌మెంట్‌తో కిడ్నీ రాకెట్ దందా గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఇకపోతే హాస్పిటల్ నిర్వాహకుడు సుమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, అలకనంద హాస్పిటల్ మేనేజ్మెంట్ వ్యక్తులు, సర్జరీ చేసిన వైద్యులు ఇంకా అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దళారి పవన్ కూడా నిందితుల జాబితాలో ఉన్నాడు. ముందుముందు కిడ్నీ రాకెట్‌పై పోలీసులు చేస్తున్న దర్యాప్తులో మరిన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టే అవకాశముంది.