Damodara Raja Narasimha : దానిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.. త్వరలో అన్ని పరిష్కారం అవుతాయి..
- గాంధీ ఆస్పత్రి సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ
- డ్రైనేజ్, స్టాఫ్ కొరత, పరికరాల సమస్యలపై చర్చ
- కొత్త IVF సెంటర్ల ఏర్పాటు, నిబంధనలు ఉల్లంఘించిన క్లినిక్‌లపై చర్యలు
- “త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి” - మంత్రి హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆస్పత్రిని సందర్శించి పేషెంట్లు, అటెండెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్పత్రిలో డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీసులు, నర్సింగ్ విభాగంలో కొరతలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అన్నీ ఒకే ఫ్లోర్‌లో ఉండాలనే అభిప్రాయాలు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆస్పత్రుల సంఖ్య పెరిగినా, పరికరాలు సరిపోవడం లేదని, క్రిటికల్ కేసుల్లో స్టాఫ్ కొరత ఎక్కువగా ఉన్నందున దీనిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. పేషెంట్ అటెండెంట్ల కోసం ప్రత్యేకంగా అకామిడేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని, CSR కింద శాశ్వత నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
గాంధీ ఆస్పత్రిలో రెండు వేలకుపైగా బెడ్స్ ఉన్నందున వాటికి తగిన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. పాత పరికరాలను తొలగించి, కొత్త పరికరాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. IVF సెంటర్లలో నిబంధనలు అతిక్రమిస్తున్న కొన్ని క్లినిక్‌లపై చర్యలు ప్రారంభమయ్యాయని, కొన్నిటిని ఇప్పటికే మూసివేశామని వెల్లడించారు. అలాగే పెట్ల బురుజు, కొండాపూర్‌లో కొత్త IVF సెంటర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల పాజిటివ్ ఫలితాలు వచ్చాయని వివరించారు.
హాస్టల్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని, పరికరాల నిర్వహణ, స్టాఫ్ నియామకాలు వంటి అంశాలపై త్వరలోనే పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. “ప్రభుత్వం ఈ సమస్యలను సీరియస్‌గా తీసుకుంటోంది… త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి” అని ఆయన స్పష్టం చేశారు.
Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డితో ములాఖాత్ కానున్న జగన్!
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!