Hyderabad: హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం మూడు అంతస్తుల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో “శుభనందిని చిట్ ఫండ్” బోర్డు తొలగించే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి నాచారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫాగ్ ద్వారా రక్షణ చర్యలు చేపట్టారు.
Also Read: Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ
కాకపోతే, అగ్ని నుండి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో జటోతు బాలు (37) ఇనపగుర్తు గ్రామం, కేసముద్రం మండల వాసి కాగా, మల్లేష్ (27) సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, తుంగతుర్తి వాసిగా మృతులుగా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై పోలీసులు పూర్తి విచారణ చేపట్టి, మిగతా వివరాలను సేకరిస్తున్నారు.