కరోనా మహమ్మారి సమయంలో పూర్తిగా కోవిడ్ రోగుల సేవలకే పరిమితం అయ్యింది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి… మొదటి వేవ్ తగ్గిన తర్వాత నాన్ కోవిడ్ సేవలు ప్రారంభించినా.. మళ్లీ సెకండ్ వేవ్ పంజా విసరడంతో.. కోవిడ్ సేవలకే పరిమితం అయ్యింది… అయితే, క్రమంగా ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. రేపటి నుంచి మళ్లీ సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. కోవిడ్…
కరోనా రోగులు ఆస్పత్రుల్లో ఉంటే.. వారికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియక.. వారి అటెండర్లు పడిగాపులు పడాల్సిన పరిస్థితి.. కరోనా పేంషట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. వారి అటెండర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆహారానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనగా.. దానికి తోడు లాక్‌డౌన్ వారి కష్టాలను రెట్టింపు చేసింది.. అయితే, ఇంత కాలం కోవిడ్ రోగులకు ఇంటి వద్దకే వెళ్లి భోజనం అందిస్తూ వస్తున్న వేదం ఫౌండేషన్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు…
సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ దాటి సీఎం కేసీఆర్ బయటకు రావాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందన్నారు. ప్రజల విజ్ఞప్తులను కూడా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకే టైం ఇవ్వని సీఎం..ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత బయటక వచ్చారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారు…సీఎం కేసీఆర్ గాంధీకి వెళ్లడం పట్ల చాలా సంతోషిస్తున్నామన్నారు.…
ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం అంటూ గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు, నర్సులకు భరోసా ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా రోగులతో నేరుగా మాట్లాడారు.. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను పలుకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. మీకు మేం ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పారు.. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ,…
ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే గాంధీకి వెళుతున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు ఉంచారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి 16 వేలకు పెంచాలి అని తెలిపారు. అలాగే వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ ను ఇంత వరకు అతీగతీ లేదు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి. జూడాలతో…
సీఎం కేసీఆర్ తొలిసారిగా హైదరాబాద్ లోకి గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తరువాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన తరువాత ఎలాంటి…