Pawan Kalyan: ప్రజా గాయకుడు గద్దర్ నిన్న మృతి చెందిన విషయం తెల్సిందే. అల్వాల్‌లోని ఆయన ఇంటివద్ద జులై 20న తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పటి నుంచి హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఒక్కసారిగా మావోయిస్ట్ పార్టీతో పాటు తెలంగాణ మొత్తం విషాదంలో కూరుకుపోయింది.
అమ్మా తెలంగాణమా అంటూ అణువనువును తట్టిలేపిన ఆ స్వరం ఇక సెలవు తీసుకుంది. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ.. తెలంగాణ గోసకు పతాకమైన నిలిచి ఆ గానం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషికి గౌరవ సూచకంగా.. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం దీనిపై వివాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపడంపై యాంటీ టెర్రరిజం ఫోరం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గద్దర్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అయితే, ఎల్బీ స్టేడియంలో ఉంచిన గద్దర్ పార్థివదేహానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఘన నివాళులు ఆర్పించారు. తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలు ప్రాణం పోశాయని ఆమె తెలిపారు.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని మేడ్చల్ డీసీపీ సందీవ్ రావు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము.. ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేపడుతుంది అని డీసీపీ పేర్కొన్నారు. అన్ని శాఖల సిబ్బంది ఇక్కడే ఉన్నారు.. నిన్న సాయంత్రం నుండే చాలా మంది ఎల్బీ స్టేడియం దగ్గరకు వెళ్తున్నారు అని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు( సోమవారం ) ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలోనే ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి.
తన గొంతు ద్వారా తెలుగు సమాజమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా రోల్ మాడల్ గా మార్చిన గొప్ప గాయకుడు గద్దర్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది.. సిద్ధాంతాలు వేరైనప్పటికీ అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు.. తెలంగాణ సాధన కోసం అంకిత భావంతో పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు నేడు( సోమవారం ) ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలోనే ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన పార్థీవదేహాన్ని ఆదివారం సాయంత్రం నుంచి.. ఎల్బీ స్టేడియంలో ఉంచారు. తద్వారా బంధువులు, అభిమానులు, ఉద్యమకారులు.. ఆయన్ని కడసారి చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు.
దళిత రచయిత, గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.