ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని మేడ్చల్ డీసీపీ సందీవ్ రావు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము.. ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేపడుతుంది అని డీసీపీ పేర్కొన్నారు. అన్ని శాఖల సిబ్బంది ఇక్కడే ఉన్నారు.. నిన్న సాయంత్రం నుండే చాలా మంది ఎల్బీ స్టేడియం దగ్గరకు వెళ్తున్నారు అని ఆయన తెలిపారు. అక్కడికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది.. ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Read Also: Tilak Varma Half Century: రిషబ్ పంత్ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ ఫీట్ మిస్!
గద్దర్ ఇంటి నుంచి స్కూల్ దగ్గరికి వచ్చే దారిలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని మేడ్చల్ డీసీపీ సందీప్ రావు అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి రెండు ఫ్లాటూన్ల ఫోర్స్ తీసుకున్నామన్నారు. గద్దర్ ఇంటి వరకు వాహనాలను అనుమతించము.. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది.. అల్వాల్ పరిసర ప్రాంతాల్లో అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాము.. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచిస్తున్నాము అని డీసీపీ సందీప్ రావు పేర్కొన్నారు.
Read Also: Stock Market Opening: పుంజుకున్న స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 65800, నిఫ్టీ 19600పైకి
అయితే, గద్దర్ అంతిమయాత్ర రూట్ మ్యాప్ వివరాలు.. ఎల్బీ స్టేడియం నుంచి 12 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసం వరకు అంతిమయాత్ర జరుగుతుంది. అల్వాల్‌లో గద్దర్ నివాసం వద్ద కొద్దిసేపు పార్థికదేహం ఉంచనున్నారు.. అక్కడ నుంచిబోధి విద్యాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.