అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రజా గాయకుడు గద్దర్ తన స్వరంతో కోట్లాది మంది ప్రజల్లో చైతన్య జ్వాలలను రగిల్చారు. చావుకు దగ్గరలో ఉన్నప్పుడు, చివరి క్షణాల్లో కూడా పాటను మాత్ర వదల్లేదు. అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి ఐసీయూలోనూ పాటలు పాడారని మీడియాకు చెబుతూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ ఈ రోజు కన్నుమూశారు. గద్దర్ చనిపోయినట్లు కొడుకు సూర్యం తెలిపారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. అయితే.. ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, gaddar, komatireddy venkat reddy, gaddar passes away
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ మరణవార్త విని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలతో పాటు దేశంలోని ప్రముఖులు షాక్ అవుతున్నారు. రెండు రోజుల కిందటే ఆయనకు గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని.. కుటుంబసభ్యులు వెల్లడించారు.
ప్రజా గాయకుడు గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా కవి - గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని సీఎం జగన్ కొనియాడారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని అన్నారు.
దళిత రచయిత, గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గద్దర్ చనిపోయినట్లు కొడుకు సూర్యం తెలిపారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు.