రష్యాలో భారీ విస్ఫోటనం జరిగింది. డాగేస్తాన్ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లుగా అధికారులు తెలిపారు.
పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని పర్యాటక కేంద్రం దగ్గర హఠాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో ఒక మహిళ సహా నలుగురు పర్యాటకులు మృతిచెందారు.
భారీ తుఫాన్ దేశ రాజధాని ఢిల్లీని హడలెత్తించింది. బుధవారం సృష్టించిన విలయానికి నగరం అతలాకుతలం అయింది. దుమ్ము, ఈదురుగాలులతో కూడిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది.
ఓ లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో నాలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో నిన్న (బుధవారం) సాయంత్రం జరిగింది.
జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్విటర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్ కు చెందిన సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు
Rice Mill Collapse : హర్యానాలోని కర్నాల్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రైస్ మిల్లు కుప్పకూలింది. మూడు అంతస్తుల రైస్ మిల్లు భవనంలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం, ములకలేడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రును చికిత్సనిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. ఇవాళ (శనివారం) వేకువజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైనున్న మిద్దె కప్పు కూలి.. నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్థులు ఘటనాస్థలానికి…