జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్విటర్ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్ కు చెందిన సయ్యద్ సయూద్దీన్ మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నాట్లు ఓవైసీ పేర్కొన్నారు. చిన్న కూతురికి ఆరు నెలల వయసే ఉంది.. మృతదేహాన్ని రప్పించడంలో నాంపల్లి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారు.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్యాగ్ చేశారు.
Read Also: Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్.. కేన్ మామ వచ్చేస్తున్నాడు
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు చోటు చేసుకుంది. రైలు పాల్ఘడ్ చేరుకున్న సమయంలో.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఫైరింగ్ జరిపాడు. ఈ కాల్పుల్లో అతని సీనియర్ అధికారి ఏఎస్సైఐ టికా రామ్ మీనాతో పాటు మరో ముగ్గురు కూడా మృతి చెందారు. ఆపై దహిసర్ స్టేషన్ దగ్గర రైలు దూకి చేతన్ సింగ్ పారిపోయాడు. కాగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షార్ట్‌టెంపర్‌తోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. మరోవైపు ఉగ్రదాడి కోణం ఉంది అంటూ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
Read Also: IND vs WI 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. సిరీస్ కోసం పోటాపోటీ
అయితే, కర్ణాటక కు చెందిన సయ్యద్ హైదరాబాద్ నాంపల్లిలో నివాసం ఉంటున్నారు. గుజరాత్ గల్లీలోని ఓ మొబైల్ షాపులో ఉద్యోగిగా సయ్యద్ పనిచేస్తున్నాడు. అజ్మీర్ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి దేహాన్ని మృతుడి స్వస్థలం బీదర్ కు తరలించనున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.