వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని చేసిన ప్రకటనపై జొమాటో క్లారిటీ ఇచ్చింది. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే కాన్సెప్ట్‌పై పలు వర్గాల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని తమ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందో జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వివరణ ఇచ్చారు. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సర్వీస్ అందరికీ కాదని, కొన్ని సమీప ప్రాంతాలకు మాత్రమేనని స్పష్టం చేశారు. అది కూడా పాపులర్ ఐటమ్స్‌కి మాత్రమే…
రూపాయికి ఏం వస్తుంది. ఒక అగ్గిపెట్టె.. ఒక చాక్లెట్.. అంతకుమించి ఏమీ రావు. కానీ ఏపీలో అక్కడికెళితే ఒక్కరూపాయికి మీ ఆకలి తీరుతుంది. అక్కడ వేడి వేడి ఇడ్లీని కస్టమర్లకు అందిస్తున్న ఈయన పేరు చిన్ని రామకృష్ణ. అందరూ రాంబాబుగా పిలుచుకునే ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఓ చిరు హోటల్ యాజమాని. గత 16 సంవత్సరాలుగా రాంబాబు ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ జనతా హోటల్ నడుపుతున్నాడు. ఐతే ఈ…
నాణ్యత లేని భోజనం, అపరిశుభ్రమైన బోరు నీళ్లు విద్యార్థుల పాలిట ప్రాణ సంకటంగా మారింది.ఇటు స్కూల్స్ ,అటు హాస్టళ్లు, చివరికి బాసర ట్రిపుల్ ఐటీలో పెట్టే పుఢ్ పైన విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా పాయిజన్ కావడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాంతులు, విరేచనాలతో తరచూ ఆసుపత్రి పాలౌతున్న విద్యార్థులపై ఓ రిపోర్ట్. మొన్న రూరల్ కేజీబీవీ తర్వాత ఘోట్కూరి ప్రాథమిక పాఠశాల అంతకంటే ముందు బాసర ట్రిపుల్…
దేశానికి ప్రధానమంత్రి అయినా ఆయన అమ్మకు కొడుకే. పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లి ముందు చిన్నవారే. వారి చిన్నతనం ఆమెకు గుర్తుకువస్తూ వుంటుంది. అందుకే ఎప్పుడూ అంటుంటారు దేశానికి రాజైనా… తల్లికి కొడుకే. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ప్రధాని మోడీ రెండు రోజులపాటు సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. గుజరాత్ పర్యటనలో ఆయన తన తల్లిని హీరాబెన్ ని కలిశారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. మాతృమూర్తి క్షేమసమాచారాన్ని…
కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అయితే, టీటీడీ నిర్ణయాల వల్ల శ్రీవారు భక్తులకు దూరం అవుతారని మండిపడుతున్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. టీటీడీ నిర్ణయాలపై పయ్యావుల కేశవ్ ఫైర్ అవుతున్నారు. భక్తులకు శ్రీవారిని దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. టీటీడీ తీసుకునే నిర్ణయాలు శ్రీవారి భక్తుల మనోభావాలకు విరుద్దంగా జరుగుతున్నాయన్నారు. తిరుమల ప్రాభవాన్ని, ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది.సామాన్య భక్తులకు ఏడుకొండల వాడిని దూరం…
కరోనా మహమ్మారి రాక మునుపు ప్రతి ఒక్కరి జీవితాలు సంతోషంగా ఉన్నాయి. ఉన్నదాంట్లో తింటూ, వచ్చిన పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. కరోనా మహమ్మారి వచ్చి ఒక్కసారిగా మొత్తం తలక్రిందులు చేసింది. కరోనా కాలంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ప్రైవేటు టీచర్ల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఉద్యోగాలు కోల్పోవడంతో రోడ్డున పడ్డారు. దీంతో ఉపాధికోసం వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. Read: Viral: కొండల మధ్య 19 ఏళ్ల…
హోటల్ కి వెళ్లి ఏదైనా ఆర్డర్ చేస్తే టేబుల్ ముందుకు రావడానికి కనీసం 10 నిమిషాల సమయమైనా పడుతుంది. కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువ సమయమైనా పట్టవచ్చు. కాకా హోటల్‌కి వెళ్లినా కావాల్సింది ఇవ్వడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది. ఆర్డర్ చేసింది క్షణాల్లో టేబుల్ ముందుకు రావాలంటే కుదరని పని. అయితే, మెక్సికో లోని కర్నే గారిబాల్డీ అనే హోటల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ హోటల్‌లో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా క్షణాల్లోనే టేబుల్…
ఆవుపాలు, గేదెపాలను అధికంగా తీసుకుంటుంటారు. అయితే, కొంతమందికి ఈ పాలు పడవు. ఇలాంటి వారు సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ వంటివి తీసుకుంటు ఉంటారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఆలూ మిల్క్ అందుబాటులోకి వచ్చాయి. స్వీడన్‌కు చెందిన డగ్ అనే కంపెనీ ఆలూ మిల్క్‌ను యూకేలో ప్రవేశపెట్టింది. ఈ ఆలూ మిల్క్‌లో వివిధ విటమిన్స్‌తో పాటు రుచికరంగా కూడా ఉండటంతో వీటిని తాగేందుకు యూకే వాసులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఆవులు, గేదెలు వంటి…
ఇప్పుడు పల్లెటూరి నుంచి నగరాల వరకు ఎక్కడ చూసినా హోటళ్లు, రెస్టారెంట్లు మరకు కనిపిస్తుంటాయి. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ నష్టం రాదన్న సంగతి తెలిసిందే. అయితే, కొందరు అధికలాభం కోసం భారీగా ధరలు పెంచి హోటళ్లను రన్ చేస్తుంటారు. అలాంటి హోటళ్ళు ఎక్కువకాలం నిలబడలేవు. కానీ, కొన్ని హోటళ్లు మాత్రం వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వందేళ్లైనా ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ముంబైలోని లియోప్లాడ్ కేఫ్ ఉంది. ఈ కేఫ్‌ను సుమారు 150 ఏళ్ల క్రిందట స్థాపించారు. అప్పటి నుంచి…
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుండటంతో ఉద్యోగ ఉపాది అవకాశాలను చాలా వరకు కోల్పోయారు. ఒక ఇంట్లో ఎలాంటి చిన్న వేడుక జరిగినా ఎట్టలేదన్నా పదివేలకు పైగా డబ్బులు ఖర్చు అవుతాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక పెళ్లి వేడుకలకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి ఖర్చులో సింహభాగం భోజనాలకే అవుతుంది. కరోనా కాలంలో ఆ స్థాయిలో ఖర్చు చేయాలి అంటే మామూలు విషయం కాదు. అయితే, ఈ ఖర్చుల బాధ…