కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుండటంతో ఉద్యోగ ఉపాది అవకాశాలను చాలా వరకు కోల్పోయారు. ఒక ఇంట్లో ఎలాంటి చిన్న వేడుక జరిగినా ఎట్టలేదన్నా పదివేలకు పైగా డబ్బులు ఖర్చు అవుతాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక పెళ్లి వేడుకలకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి ఖర్చులో సింహభాగం భోజనాలకే అవుతుంది. కరోనా కాలంలో ఆ స్థాయిలో ఖర్చు చేయాలి అంటే మామూలు విషయం కాదు. అయితే, ఈ ఖర్చుల బాధ నుంచి బయటపడేందుకు రాజన్న సిరిసిల్లలోని వేములవాడ పట్టణానికి చెందిన మత పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లో ఇకపై ఒకే కూర, ఒకటే స్వీటు ఉండాలని నిర్ణయించారు. ముస్లిం మత పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
Read: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… ఒక్కరోజులో…