కరోనాకు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా, ప్రపంచం మొత్తం వ్యాపించింది. గత మూడేళ్లుగా కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తున్నది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా లాభం లేకుండా పోతున్నది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల వ్యాప్తితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే, చైనాలో రెండు మూడు కేసులు నమోదైన నగరాల్లో కఠినమైన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలెవరినీ బయటకు రానివ్వడంలేదు. గత రెండు వారాలుగా జియాంగ్ సిటీ…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయుధాలు, దేశ సరిహద్దులు, శతృదేశాలు, అమెరికా,దక్షిణ కొరియాపై ఆగ్రహ జ్వాలలు వంటి మాటలతో ఆవేశంగా మాట్లాడే కిమ్, ఈసారి ఆ మాటలను పక్కన పెట్టి దేశాభి వృద్ది గురించి, దేశంలో నెలకొన్న సమస్యల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ది గురించి, ఆహార సమస్యల నుంచి బయటపడే విషయాల గురించి మాట్లాడారు. 2022 వ సంవత్సరాన్ని గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ ఇయర్ గా…
కొత్త సంవత్సరం వేళ ఫుడ్ డెలివరీ యాప్‌లు భారీగా లాభాలు ఆర్జించాయి. సరికొత్త రికార్డుసు సృష్టించాయి. దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లైన స్విగ్గి, జోమాటోలు సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 31 వ తేదీన స్విగ్గిలో ప్రతి నిమిషానికి 9 వేల ఆర్డర్లు బుక్ చేయగా, జొమాటోలో నిమిషానికి 8 వేల ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నది. గతేడాది డిసెంబర్ 31 వ స్విగ్గిలో నిమిషానికి 5,500 ఆర్డర్లు రాగా, ఆ రికార్డును స్విగ్గి ఈ…
5 రూపాయలకు ఏమోస్తుంది అని అడిగితే ఏమని చెప్తాం. కనీసం సింగిల్ టీకూడా రాదు. టిఫిన్ చేయాలంటే కనీసం రూ.30 నుంచి రూ. 50 వరకు ఉండాలి. రోడ్డు పక్కన ఉన్న టిఫెన్ షాపులో తినాలన్నా ఎట్టలేదన్నా కనీసం రూ.20 అయినా ఉండాలి. అయితే, నాగపూర్‌లోని భారత్‌మాతా చౌక్ వద్ద ఉన్న టీబీ ఆసుపత్రి ముందు ఓ 65 ఏళ్ల బామ్మ టిఫెన్ బండి నడుపుతుంది. ఆమె రోజు తర్రి పోహాను విక్రయిస్తుంది. అదీకూడా కేవలం 5…
ఇటీవల కాలంలో ఫుడ్ బ్లాగ్‌లు సూపర్ ఫేమస్ అవుతున్నాయి. ఫుడ్ ను తయారు చేయడమే కాదు. తినేవారు కూడా చాలా ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి ఓ ఉదాహరణ సాపాటు రామన్. టైమ్ సెట్ చేసుకొని ఫుడ్ లాగిస్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇండియాలో అదీ తమిళనాడు రాష్ట్రాలనికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన భోజనం, బిర్యానీ, చికెన్ మటన్ వంటి వాటిపై దృష్టి సారించారు. ఇక విదేశాలకు చెందిన వారైతే పిజ్జాలు,…
కోడిగుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే దానిపై చాలా మంది మల్లగుల్లాలు పడుతుంటారు. ఎగ్ శాఖాహారమై అని కొందరూ, కాదు కాదు మాంసాహరమని మరికొందరు చెబుతుంటారు. అయితే, కోడి నుంచి వస్తుంది కాబట్టి ఎగ్ అనేది మాంసాహారమే అని వాదించేవారికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో చెక్ పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎగ్ అన్‌ఫెర్టిలైజర్ గుడ్డు అని, ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని, ఎగ్ వైట్‌లో ప్రోటీన్లు మాత్రమే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. …
మంచుకురిసే వేళలో.. ఉదయాన్నే ఓ కప్పు టీయో, కాఫీయో తాగితే ఆ అనుభూతి గురించి టీ, కాఫీ తాగేవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉదయం మనం తాగే టీ, కాఫీ కంటే వెల్లుల్లి టీ ఎంతో బెస్ట్ అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు ఒక్క కప్పు వెల్లుల్లి టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెల్లుల్లిని మనం రోజు వంటలో ఉపయోగిస్తుంటాం. వెల్లుల్లి.. వంటకే ప్రత్యేక రుచిని తెస్తుంది. అలాగే వెల్లుల్లి టీ కూడా ప్రత్యేకమైన…
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫుడ్ ఐటెమ్స్‌లో పిజ్జా కూడా ఒకటి. ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో పిజ్జాలు అమ్ముడవుతుంటాయి. పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పట్టణాల వరకూ పిజ్జాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఆర్డర్ చేసిన పిజ్జాను స్లైసెస్ లాగా కట్ చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. అయితే, ఇప్పుడు పిజ్జాతో పాటుగా ఓ చిన్న టేబుల్ టూల్‌ను ఫ్రీగా అందిస్తున్నారట. Read: ఎలన్ మస్క్ సూటి ప్రశ్న: 6…
మామూలుగా అందరూ బరువు తగ్గడానికి చాలా రకాల డైట్‌లు ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా చాలా మంది ఆహారాన్ని తినడం తగ్గించి బరువు తగ్గుదామనుకుంటే అది పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శరీరానికి అవసరమైనంత పోషకాలు అందకపోతే రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారినపడే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం పాటించే డైట్‌లో కొన్ని ఆహర పదార్థాలను చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం తినే డైట్‌లో ఏదైనా పండ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత పోషకాలు అందుతాయని…
మారుతున్న జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్) అంటారు. ఎల్‌డీఎల్ మన శరీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువగా ఉండడం అసలు మంచిదికాదు. ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోకపోతే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు…