ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్రం అప్రమత్తం అయింది. బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లే భక్తులు జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక చమోలీ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని జిల్లా అధికారులు పేర్కొన్నారు. గతేడాది చమోలీ జిల్లాలో పెద్ద ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడటంతో నదీమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పెద్ద ఎత్తున నదిలో వదర పెరగడంతో అనేకమంది గల్లంతయ్యారు. మరలా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
Read: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు: వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరాలి…