కేరళకు చెందిన వరుడు ఆకాష్, వధువు ఐశ్వర్య పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఈ నెల 18న ముహూర్తం. అయితే కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా అవకాశం లేదు. ఉన్న ఊరునుంచి పెళ్ళి మంటపానికి వెళ్లేందుకు అవకాశమే లేదు. ఒకవైపు ముహూర్తం దగ్గరపడుతోంది. అటు పెళ్ళి కూతురు, ఇటు పెళ్లి కొడుకు బంధువుల్లో ఒకటే టెన్షన్ ఏంచేయాలి. చివరకు వారికో ఆలోచన వచ్చింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో పెళ్ళికి వంటలు చేసే భారీ పాత్రను ఎంచుకున్నారు.
ఈ భారీపాత్రలో వధూవరులను ఇద్దరినీ వుంచి అటు కొందరు ఇటు కొందరు గెంటుకుంటూ కల్యాణ మంటపానికి చేర్చారు. అక్కడ వారి పెళ్ళి వైభవంగా సాగింది. బంధువులు తక్కువమందే హాజరయ్యారు. వధూవరులను ఈ విధంగా చేర్చాలని ఆలోచనను అంతా మెచ్చుకున్నారు. పెళ్ళయితే అయింది.. కానీ బంధువులు మాత్రం పెద్దగా హాజరుకాలేదు. ఏదో ఒకటి అయింది.. పెళ్లి తంతు అయితే ముగిసిందని పెళ్లికొడుకు, పెళ్ళి కూతురు బంధువులు హ్యాపీగా ఫీలయ్యారు. ఎలా పెళ్ళి మంటపానికి వెళ్ళారో.. మెడలో దండలతో మళ్లీ అదేవిధంగా ఇంటికి చేరారు. భారీ వరదల్లోనూ ఈ జంట ఒక్కటవ్వడంపై కామెంట్లు వస్తున్నాయి. అలప్పుజాలో జరిగిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.