నిన్నటి రోజున నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు నగరంలో పెద్ద ఎత్తున వరద సంభవించింది. ఈ వరద కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీ వరద వచ్చిచేరింది. ఈ వరద కారణంగా జంట జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీలోకి వరద వచ్చి చేరింది. ఈ వరదల్లో మొసలి కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి మొసలిని పట్టుకొని జూకు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంఈ అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు.
Read: జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక: అవసరమైతే తప్పా బయటకు రావొద్దు…