సీఎం లేఖ రాయగానే కేంద్రం స్పందించింది: జీవీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు.
“ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం” రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని తెలిపారు జీవీఎల్. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే, సరిగ్గా స్పందించ లేదని పేర్కొన్నారు. “విపత్తు సహాయ నిధి” కింద గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని జీవీఎల్ ప్రశ్నించారు. కేవలం లేఖలు రాసి చేతులు దులుపుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన అన్నారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించలేదు? భాధితులను ఎందుకు సీఎం ఓదార్చే ప్రయత్నం చేయడం లేదంటూ జీవీఎల్ మండిపడ్డారు. ప్రజల వద్దకు పోకుండా, ప్యాలెస్ నుంచి పాలన చేయాలని నిర్ణయించుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పి, సహాయక చర్యలు ప్రారంభిం చాలి. రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి కేవలం రాజకీయ ప్రకటనలు చేయడంలో బిజీ బిజీగా ఉన్నారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదోవపట్టకుండా…. వెంటనే బాధితుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వెంటనే బీసీ కులాల జనాభా లెక్కింపు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్, టీడీపీ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకం “జలజీవన్ మిషన్” ను సరిగా సద్వినియోగం చేసుకుని, అమలు చేయని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపులు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ… ప్రజలను అప్రమత్తం జాగృతం చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు, పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేవలం అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందా? అంటూ జీవీఎల్ ప్రశ్నించారు.
- Tags
- ap
- bjp
- Floods
- GVL Narasimha Rao
- jagan
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!