తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరం సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్డ అలర్ట్ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు.…
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని తెలియని కూలీలు ఇవాళ ఉదయం పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు నిలదీస్తారనే సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. వరదలతో జనం గోస పడుతుంటే వరద నష్టం అంచనా, పరిహారం ప్రకటించడంలేదని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే.. కేంద్రమే అన్నీ చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకని రాజాసింగ్ సీఎంను ప్రశ్నించారు.…
తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తోడు.. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో గోదావరి పోటెత్తిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో వరదలతో అతలాకుతలం అవుతున్నారు.. తెలంగాణలో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు.. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు నస్తపోయాయని లేఖలో పేర్కొన్న ఆయన.. వరద ప్రాంతాల్లో…