బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు నిలదీస్తారనే సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. వరదలతో జనం గోస పడుతుంటే వరద నష్టం అంచనా, పరిహారం ప్రకటించడంలేదని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే.. కేంద్రమే అన్నీ చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకని రాజాసింగ్ సీఎంను ప్రశ్నించారు. అంతేకాకుడా.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తుందని, అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో కేసీఆర్ సర్కారు ఒక్కసారి కూడా పరిహారం ప్రకటించలేదని మండిపడ్డారు.
కాగా.. పంట పరిహారానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన వెయ్యి కోట్లు ఏం చేశారని గతేడాది హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని అన్నారు. ఎప్పడు వరదలు వచ్చిన వేల కోట్లు ప్రకటించడం మినహా ఒక్కపైసా విదల్చలేదని విమర్శించారు. అంతేకాకుండా.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్రం ఇస్తున్న నిధులను ఏం చేస్తున్నారో చెప్పాలని రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈనేపథ్యంలో.. వరద బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు, వైద్య సదుపాయాలతో పాటు పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం, ఉచితంగా విత్తనాలు ఎరువులు అందించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఫామ్ హౌస్ నుంచి వరద ప్రాంతాలకు కేసీఆర్ ను గుంజుకొచ్చిన ఘనత బిజెపిదే. రోడ్డు మార్గంలో పోతే ప్రజలు నిలదీస్తారనే భయంతోనే కేసీఆర్ ఆకాశ మార్గాన పోవాలను కుంటున్నారు. వరదలతో జనం గోస పడుతుంటే ఇప్పటిదాకా నష్ట పరిహారం ప్రకటించడం కేసీఆర్ కు చేతకాలేదు.
-శ్రీ @TigerRajaSingh pic.twitter.com/snXIPVsCUf— BJP Telangana (@BJP4Telangana) July 17, 2022