Ys Sharmila: కాళేశ్వరం ఆయనకో పెట్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు.పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి వరద ధాటికి మునిగి పోయిన పంట పొలాలను రైతులతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. గోదావరి వరద ధాటికి 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు వివరించారు. కేసీఅర్ తానే ఇంజనీర్ గా, సైంటిస్ట్ గా, డాక్టర్ గా, అపర మేధావిగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు మునిగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఅర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని విమర్శించారు.
కాళేశ్వరంప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు. కానీ వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,పొలాల్లో ఇసుక మేటలు వేసిందన్నారు. దీనివల్ల ప్రయోజనం జరగకపోగా, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గేట్లు ఎత్తేముందు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.18 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన దేవాదుల ప్రాజెక్ట్ చెక్కు చెదరలేదని, కాళేశ్వరం ఎందుకు ఇలా అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికి లాభం అన్నారు. పరిస్థితిని పక్కదారి పట్టించేపనిలో ముఖ్యమంత్రి కేసీఅర్ మాట్లాడుతూ ఎప్పుడూ వరదలు రాలేదు అంటున్నారు.
Also Read
మేఘ మథనం అంటున్నారని అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నాడని వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రాజెక్ట్ లు కట్టే ముందు వరదలు వస్తే ఎలా రక్షించుకోవాలని అని అంచనా వేస్తారు, కేసీఅర్ కు పరిపాలన చేత కాదని ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి లేనట్లేనని విమర్శించారు.YSR తెలంగాణ పార్టీ తరుఫున మంచిర్యాల పట్టణంలోని NTR నగర్ లో వరదలకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తాం అన్నారు వైఎస్ షర్మిల. పోడు రైతులకు పట్టాలిస్తానన్న కేసీఆర్.. ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వకపోగా, భూములు లాక్కుంటూ ఆదివాసీ గిరిజనుల పొట్ట కొడుతున్నాడు. అటవీ అధికారులతో దాడులు చేయిస్తూ ఆనందం పొందుతున్నాడు. మహిళల చీరె ఊడేటట్టు ఈడ్చుకెళ్లినా దొర గారు బయటకు రావడం లేదని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!