Electric Bike Catches Fire: ఆగని ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రమాదాలు.. సామర్లకోటలో బ్యాటరీ బైక్ దగ్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రో ధరలు పెరిగిపోవడంతో ఇప్పుడు అంతా ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారించారు. సిటీలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు కనిపిస్తున్నాయి. బైక్‌లతో పాటు కార్లు, ఆటోలు ఇలా చాలా రకాల వెహికల్స్ రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే, ఇదే సమయంలో వరుస ప్రమాదాలు కూడా కలవర పెడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాటరీ వాహనాలు చార్జింగ్ పెట్టిన సమయంలో.. ప్రయాణ సమయంలో ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగి ప్రమాదాలు జరిగిన ఘటలు ఎన్నో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఘటన వెలుగు చూశాయి.. తాజాగా, ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది.
Read Also: ICC Rankings: నంబర్‌వన్‌గా పాకిస్థాన్ వికెట్ కీపర్.. నాలుగో స్థానానికి పడిపోయిన సూర్యకుమార్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఇవాళ కాకినాడ జిల్లా సామర్లకోట స్టేషన్ సెంటర్‌లో రోడ్డుపై నిలిపి ఉన్న బ్యాటరీ బైక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా.. మొదట పొగలు వచ్చి.. ఆ తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యింది.. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఈ సెంటర్ లో బైక్ తగులబడిపోతుండడంతో పలువురు పరుగులు పెట్టారు.. వాహన యజమాని పాన్ షాపు వద్దకు వచ్చినపుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ మంటల్లో చిక్కుకున్న బాటరీ బైక్ సుమారు రూ. లక్షా పది వేలు విలువ కలిగి ఉంటుందని బైక్ యజమాని వాపోయారు. ఇటీవల కాలంలో పలు పట్టణాలలో బ్యాటరీ బైకులు దగ్ధం అవుతున్నట్లు వార్తలు వస్తూనే ఉండగా.. ఇప్పుడు సామర్లకోటలో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం కావడం కలకలం సృష్టిస్తోంది..
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!