Secunderabad Fire Accident: సికింద్రాబాద్ ఘటనపై ప్రధాని, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM.Modi shocked Over Secunderabad Incident: సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని, సీఎం కేసీఆర్. మృతుల కుటుంబాలకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ.2 లక్షలు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్, మృతుల కుటుంబాలకు 3 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, బెంగాల్, ఒడిశా, విశాఖ వాసులుగా గుర్తించారు అధికారులు. రూబీ హోటల్ సెల్లార్ లో ఎలక్ర్టిక్ స్కూటర్ల షోరూం నిర్వహిస్తున్నారు. సెల్లార్ పై అంతస్తులో రూబి హోటల్ ను వుంది. అందులో వసతి పొందేందుకు పర్యాటకులు వస్తుంటారు. నిన్న సోమవారం రోజూలాగానే లాడ్జిలో వుండేందుకు చాలా మంది పర్యాటకులు వచ్చారు. నిన్న రాత్రి అందరూ ప్రసాంతంగా గాఢనిద్రలో నిద్రిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది. ఏం జరుగుతుంతో పరిశీలించగా.. రూబీ హోటల్ కింద ఫ్లోర్ లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కొందరు ఫైరింజన్లు సమాచారం అందించడంతో.. హుటాహుటిన ఘటనాస్థలానికి రెండు ఫైరింజన్లు చేరుకుని మంటలార్పే పనిలో పడ్డారు.
Also Read
హోటల్ లోని వారిని కిందకి దించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, స్థానికులు. రూబీ హోటల్ లో ఎనిమిది మంది మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన వారిని అపోలో, యశోద, గాంధీలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రమాద సమయంలో మొత్తం 30 మందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది వున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు.. లాడ్జీ ఓనర్ రంజిస్ సింగ్ బగ్గా ను అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు. ఎలక్ట్రానిక్ బైక్ బాటరీ పేలుడే ప్రమాదానికి కారణమా..? లేదా ఎలక్ట్రిక్ షాట్ సర్క్యూట్ కారణమా..? బిల్డింగ్ అనుమతలు, బైక్స్ షోరూం, లాడ్జీ నిర్వాహణ అనుమతులపై, ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఫైర్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ క్లూస్ సేకరించే పనిలో పడింది. ఘటనపై స్థానిక ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు విచారణ వేగమంతం చేసారు.
Saddened by the loss of lives due to a fire in Secunderabad, Telangana. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each deceased. Rs. 50,000 would be paid to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 13, 2022
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!