Fire Accident: ప్రకాశం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలం దద్దవాడ శివారులో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగి లారీకి మొత్తం మంటలు వ్యాపించాయి. క్రమంగా అవి లారీ మొత్తానికి వ్యాపించడంతో అందులో ఉన్న 306 సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. దీంతో భయంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దిగి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక్కొక్కటిగా భారీ శబ్దాలతో సిలిండర్లు పేలడంతో సమీపంలోని గ్రామల ప్రజలు భయాందోళన చెందారు.
Read Also: Police Overaction: బైక్ ఆపలేదని..యువకుడిపై ఖాకీ కర్కసత్వం..
కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు వెళ్తుండగా లారీలో ఈ ప్రమాదం సంభవించింది. సిలిండర్లు భారీ స్థాయిలో పేలి సమీప ప్రాంతాల్లో పడటంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు ధాటికి చుట్టు ప్రక్కల పొలాల్లో మిగిలిన సిలిండర్లు ఎగిరి పడటంతో కొంత వరకు ప్రమాద తీవ్రత తగ్గింది. ఘటనలో లారీ ఆనవాళ్లు కూడా మిగలలేదు. సిలిండర్ల పేలుడు కారణంగా దద్దవాడ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాగా ప్రమాదంపై సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉదయం నుంచి లారీ శకలాలను రోడ్డుపై తొలగిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా లారీకి విద్యుత్ వైర్లు తగలడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు వివరిస్తున్నారు.