ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో మంటలు చెలరేగాయి. 8వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మధ్యాహ్నం 1 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదం సంభవించడంతో భవనంలో…
ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆపరేషన్ థియేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ సర్జరీ నిమిత్తం పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్‌లో చేరింది. మరో చిన్నారి కూడా హర్ట్ సర్జరీ కోసం ఇదే హాస్పిటల్‌లో చేరింది. వారిద్దరికి సోమవారం వైద్యులు…
Several Injured in Karachi Bakery Gas Cylinder Explosion: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేకరీ క్యాంటీన్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని…
fire accident in kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో మంటలు క్రమంగా చెలరేగిన షాపింగ్ మాల్‌లోని నాలుగు అంతస్తులకు వ్యాపించాయి.
Tata Ace Fire Incident in Jangaon District: జనగామ జిల్లాలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. చిల్పూర్ మండలం వంగాలపల్లి వద్ద మంగళవారం ఉదయం ఓ టాటా ఏస్ వాహనం దగ్దం అయింది. మంటలు గమనించిన ప్రయాణికులు హుటాహుటిన వాహనం నుంచి కిందికి దిగిపోయారు. దాంతో వారు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. టాటా ఏస్ వాహనం రన్నింగ్ లో ఉండగానే మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తతతో ఎవరికీ గాయాలు కాలేదు. షాట్ సర్క్యూట్…
తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాములో ఇవాళ ఉదయం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు నష్టపోయాయి.
ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసెలకు నిప్పంటుకుని అందులో ఉన్న ముగ్గురు చిన్నారులు మృత్యువాత చెందారు. ఈ ఘటన జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామంలో జరిగింది. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. గత నెలలో వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయి.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. తెలంగాణ నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.. ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది… బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే…
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్,…