Several Injured in Karachi Bakery Gas Cylinder Explosion: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని కరాచీ బేకరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేకరీ క్యాంటీన్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో బేకరీలోని కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎవరైనా కస్టమర్స్ ఉన్నారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
Also Read: Kodanda Reddy: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుంది: కోదండ రెడ్డి
ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా యూపీకి చెందిన వారు ఉన్నారని సీఎంకు అధికారులు తెలిపారు.