తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాములో ఇవాళ ఉదయం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు నష్టపోయాయి. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. గత ఐదు గంటలుగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: Geriatrics : జెరియాట్రిక్స్ గురుంచి మీకు తెలుసా ?
అయితే, ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన గ్యాస్ సిలిండర్ ఫ్యాక్టరీ కూడా మంటలు చెలరేగిన ప్రైవేట్ గోదాం సమీపంలో ఉంది. దీని కారణంగా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో మనాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తమిళనాడు అగ్నిమాపక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రియా రవిచంద్రన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని వారు వెల్లడించారు.