శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్ అకాడమీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంస్థలోని క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు నాసిన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం పై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్…
China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 39 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 9 మంది గాయాలపాలయ్యారు. తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్సులోని జిన్యు నగరంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా ఇవాళ మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్. 4లోని ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న మూడు కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లైఫ్ స్టైల్ బిల్డింగ్ మొదటి అంతస్తులో గల ఆరోరా బ్యాంకెట్స్ హోటల్ కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన ఉన్న ఆయిల్ కు మంటలు అంటుకొని చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన సిబ్బంది మరియు కస్టమర్స్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ లోని అన్ని దుకాణాలలో ఫైర్ సేఫ్టీ అల్లారం మోగడంతో భయాందోళనలకు…
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.. రెండు కుటుంబాలు సజీవదహనం అయ్యాయి. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి జరిగింది. పితంపుర ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల ఇంట్లోని మొదటి, రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భయ బ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదులోకి తీసుచొచ్చారు. మంటల్లో…
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్లోని బీఎఫ్-3లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు.