ఫిలిమ్ నగర్ లోని దక్కన్ కిచెన్ కూల్చివేత పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా పై ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిలిమ్ నగర్…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు ఘనంగా జరిగింది. తెలుగు ప్రజలు ఈ రోజును సందడిగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ…
విష్ణు మంచు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం “కన్నప్ప”కు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైన ఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో మిస్సింగ్ అయినట్లు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై, విచారణ కొనసాగుతోంది. ముంబైలోని హెచ్‌ఐవీఈ స్టూడియోస్ నుంచి కన్నప్ప సినిమా యొక్క కీలక విఎఫ్ఎక్స్ కంటెంట్‌ను…
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో శనివారం విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి…
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. తాజాగా.. నగరంలోని ఫిల్మ్ నగర్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఆక్రమణలను హైడ్రా (HYDRA) తొలగించింది. ఫిలింనగర్‌లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన కట్టడంపై స్థానికుల ఫిర్యాదుతో.. హైడ్రా ఫిలింనగర్ లేఅవుట్‌ను పరిశీలించింది. ఈ క్రమంలో.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించింది.
Vishwak Sen Shifted to Gachibowli from Film Nagar: టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కి వింత పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో యూత్లో మంచి క్రేజ్ అందుకున్న విశ్వక్సేన్ ఆ తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాని హీరోగా నటిస్తూనే డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్నింటితో హిట్ అందుకున్నాడు కొన్నిటితో ఇబ్బంది పడ్డాడు. అయినా…
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావని ప్రముఖ సినీ నటుడు ఎం. మురళీ మోహన్ అన్నారు. ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో, శనివారం జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ ఛాంబర్ లో జరిగిన అక్కినేని శత జయంతి, అక్కినేని యువ హీరోగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “అక్కినేని యువ ఎక్సలెన్సు అవార్డు” ను ప్రముఖ యువహీరో హీరో వరుణ్ సందేశ్ కు మురళీ…
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదట మనోజ్ అక్క మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేసింది.. దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి మరో చిన్నారి దేవత వచ్చిందంటూ తెలుపుతూ.. మనోజ్, మౌనికాలకు కుమార్తె పుట్టిందని.. మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ తెలిపింది. అంతేకాకుండా పాపకు మేము…
హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్ సర్క్యూట్ కారణంగా ఒక షాపులో మంటలు ఎగసిపడగా.. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కాగా.. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. మొదట మంటలు ఓ గ్యాస్ వెల్డింగ్ షాపు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో…
Film Nagar: ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా వివాహతను ప్రేమించి ఇబ్బందులకు గురిచేశాడు. వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు.