ANR Award: ఏఎన్ఆర్ అవార్డ్ అందుకున్న వరుణ్ సందేశ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావని ప్రముఖ సినీ నటుడు ఎం. మురళీ మోహన్ అన్నారు. ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో, శనివారం జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ ఛాంబర్ లో జరిగిన అక్కినేని శత జయంతి, అక్కినేని యువ హీరోగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “అక్కినేని యువ ఎక్సలెన్సు అవార్డు” ను ప్రముఖ యువహీరో హీరో వరుణ్ సందేశ్ కు మురళీ మోహన్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీ మోహన్ వరుణ్ సందేశ్ కు అవార్డు ప్రదానం చేసారు.
Heritage foods: హెరిటేజ్‌కు కాసుల పంట.. 5 రోజుల్లో సంపాదన ఎంతంటే..!
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
80 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అక్కినేని ఎన్నో అపురూపమైన పాత్రలు వేసి తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు అయ్యారన్నారు.. కేవలం ఆయన కోసమే సృష్టించిన పాత్రలు ఎన్నో వున్నాయి అంటూ ప్రస్తావించారు. దేవదాస్ పాత్రను చేసిన ఇతర భాషా నటులు కూడా ఆయన నటనకు నీరాజనాలు పలికిన విషయాన్నీ ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి కూడా అంటూ ప్రశంసించారు. సభను ప్రారంభించిన తెలంగాణ కాంగ్రెస్ కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. అక్కినేని తన నటనతో ఎందరికో ఆరాధ్యుడు అయ్యారన్నారు.. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఎన్నో అత్యున్నత పురస్కారాల తో గౌరవించింది అన్నారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ లాంటి యువ నటున్ని గుర్తించి సత్కరించడం సంతోషకరం అన్నారు.
Hyderabad: లిబర్టీ చౌరస్తాలో పాము కలకలం.. భారీగా ట్రాఫిక్ జామ్..
ఈ సందర్బంగా.. ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ., అక్కినేని ఒక యువ హీరో గా సినీ రంగ ప్రవేశ దినం రోజున వరుణ్ సందేశ్ లాంటి ఒక యువ హీరోకు అక్కినేని యువ పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషంగా వుందన్నారు.. అవార్డులను రూపకల్పన చేయడంలో ఆకృతి విశేషమైన అనుభవం వుందన్నారు.. ఇక ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న నిర్మాతల మండలి కార్య దర్శి ప్రసన్నకుమార్ ప్రసంగిస్తూ అక్కినేని, ఎన్టీర్ ఇద్దరు తెలుగు పరిశ్రమను అత్యున్నస్థాయిలో నిలబెట్టిన మహానటులు అంటూ ఆయన ప్రశంసించారు. వరుణ్ సందేశ్ ప్రతి స్పందన తెలియజేస్తు.., ఈ అవార్డ్ ను ఒక మహానటుడి ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నాను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయత్రి డా. కె వి కృష్ణ కుమారి, జూబ్లీహిల్స్ వాసవి క్లబ్ స్థాపక అధ్యక్షుడు కొత్త వేంకటేశ్వర రావు, సినీ దర్శకుడు రాజేష్ పాల్గొన్నారు. అక్కినేని, వరుణ్ సందేశ్ అభిమానులు ఈ కార్య క్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!