Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు తెలిపారు. రీసెంట్ గా మంచు లక్ష్మీతో మూర్తి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో ఓ ప్రశ్న వేయడంతో మంచులక్ష్మీ ఇబ్బంది పడింది. ఆమె వేసుకునే బట్టల గురించి ప్రశ్న వేయడంతో.. ఆమె ఇదే ప్రశ్న మీరు మహేశ్ బాబును అడగగలరా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో అది కాస్తా పెద్ద కాంట్రవర్సీ అయింది. సోషల్ మీడియాలో మొత్తం ఇదే ప్రశ్న గురించి…
తమకు వేతనాలు పెంచకపోతే సమ్మెకు దిగుతామని ప్రకటించిన ఫిలిం ఫెడరేషన్, అన్నట్టుగానే సమ్మెకు దిగి, సుమారు రెండు వారాలకు పైగా షూటింగ్‌లు జరపకుండా, వారికి కావలసిన డిమాండ్‌ను నెరవేర్చుకున్నారు. అయితే, డిమాండ్ చేసిన మేరకు వేతనాలు పెంచకపోయినా, నిర్మాతలు గట్టిగానే వేతనాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ఫిలిం ఫెడరేషన్‌లో ఉన్న అన్ని యూనియన్ల వారికి పెంచిన వేతనాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, తెలుగు సినిమాకు సంబంధించిన కెమెరా టెక్నీషియన్లకు మాత్రం వేతనాలు సరిగా పెరగలేదని…
Tollywood : సినీ కార్మికుల సమ్మెకు మొత్తానికి ముగింపు పలికారు. నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య ఈ రోజు లేబర్ కమిషన్ వద్ద చివరిసారిగా చర్చలు జరిగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో ఈ చర్చలు సఫలం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కార్మికులు 3 ఏళ్లలో 30 పర్సెంట్ వేతనాలు పెంచాలన్నారు. ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు జరిపాం. ఇప్పుడు…
Film Workers Strike: 16 రోజుల నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసనలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇందులో భాగంగా నేడు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన కార్మిక సంఘాల నిరసనలను కొనసాగిస్తున్నాయి. ఈ నిరసనలో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సినీ కార్మికులు. అందిన సమాచారం మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫిలిం ఫెడరేషన్ లీడర్స్, యూనియన్ నాయకులు, సినీ కార్మికులు పాలాభిషేకం చేయనున్నారు. ఈ నిరసనలో వేలాదిగా సినీ కార్మికులు తరలి…
Tollywood : గత కొద్ది కాలంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తమకు వేతనాలు పెంచాలని, అది కూడా 30% వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ పెంచిన వారికి మాత్రమే షూటింగ్‌కు హాజరవుతామని ప్రకటించింది. అయితే, తదనంతర పరిస్థితులలో ఎవరూ షూటింగ్ జరపకూడదని ఫిలిం ఛాంబర్ ప్రకటించడంతో పూర్తిగా టాలీవుడ్ షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం గతంలోనే చిరంజీవి ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో భేటీ…
ఫిలిం ఫెడరేషన్లో భాగమైన తెలుగు సినిమా డ్రైవర్స్ యూనియన్ గత 13 రోజులుగా సమ్మె చేస్తోంది. ఈ పోరాటం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్స్ యూనియన్ సభ్యులు తమ ఆవేదనను, సమస్యలను బహిరంగంగా వెల్లడిస్తూ, నిర్మాతలు తమను అన్యాయంగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఒక సింగిల్ కాల్‌షీట్‌కు డ్రైవర్‌కు 1195 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒకటిన్నర కాల్‌షీట్‌కు 1800 రూపాయలు వస్తాయి. అయితే, మూడేళ్లకు ఒకసారి కేవలం 30 శాతం వేతనం పెంచితే, దానిలో 50…
Film Federation President Anil Said Rs 13 crore is pending: తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై కొన్ని రోజులుగా నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. కొన్ని ప్రతిపాదనలు కొలిక్కిరాకపోవడంతో ప్రతిష్టంభన…
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వేతన పెంపు వివాదం కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణల సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చివరి దశ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక, మరియు నిర్మాణ సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. ఈ కీలక సమావేశంలో ఫెడరేషన్ తరపున కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన…
Tollywood : సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 8వ రోజు అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి తమ గళం వినిపించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కొందరికి పెంచి మిగతా వారికి పెంచకపోవడం అన్యాయం అన్నారు. అన్ని యూనియన్ల వారికి పెంచాల్సిందే అని డిమాండ్ చేశారు. మొదటి ఏడాది 20 శాతం పెంచి రెండో ఏడాది 10 శాతం పెంచాలని కోరుతున్నట్టు…
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో నిర్మాతల మండలి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో వేతన పెంపుపై తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో పలు ఆంక్షలతో కూడిన కీలక నిర్ణయాలను ప్రకటించారు. వేతన పెంపు వివరాలు నిర్మాతల మండలి ప్రకటించిన నిర్ణయం ప్రకారం, రోజుకు 2000 రూపాయలు…