తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వేతన పెంపు వివాదం కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణల సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చివరి దశ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక, మరియు నిర్మాణ సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. ఈ కీలక సమావేశంలో ఫెడరేషన్ తరపున కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు పాల్గొన్నారు. నిర్మాతల తరపున భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, వివేక్ కూచిభట్ల హాజరయ్యారు.
Also Read:The Raja Saab : రాజా సాబ్ పంచాయతీ వెనుక అసలు తప్పు ఎవరిది?
సమావేశంలో వేతన పెంపు వివాదం, సినీ నిర్మాణ వ్యయాలు, కార్మికుల సంక్షేమం, సాంకేతిక ఆధునీకరణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. వేతన పెంపు విషయంలో నిర్మాతలు మరియు ఫెడరేషన్ మధ్య కొన్ని ప్రతిపాదనలు కొలిక్కి రాకపోవడంతో చర్చలు హోరాహోరీగా మారాయి. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు ఫెడరేషన్ చర్చలు విఫలం అయ్యాయి. నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొన్ని ప్రతిపాదనలు కొలిక్కిరాలేదు. మరి కొన్ని రోజులు సమ్మె కొనసాగనున్నట్టే. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి కూడా మీటింగ్స్ జరుగుతాయి అని నిర్మాత సి కళ్యాణ్ అంటున్నారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు యూనియన్ లకు పర్సంటేజ్ పెంచలేమని నిర్మాతలు తేల్చి సమ్మె కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, దిల్ రాజు సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని, చిత్రీకరణలు తిరిగి ప్రారంభించేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఫెడరేషన్ నాయకులు మాత్రం ముందుగా వేతన పెంపును అమలు చేయాలని, ఆ తర్వాత నిర్మాతల ప్రతిపాదనలను దశలవారీగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపినట్లు సమాచారం. ఈ విషయంలో రెండు వర్గాల మధ్య సమన్వయం కుదరకపోవడంతో చర్చలు తీవ్రస్థాయిలో సాగాయి.
Also Read:Ontimitta: ఆ ముగ్గురు మంత్రులు నన్ను ప్రలోభాలకు గురి చేశారు: వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి
ఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు, తెలుగు సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి అన్ని వర్గాల సహకారం అవసరమని నొక్కిచెప్పారు. “ఏ రోజైనా మనం కలిసి చిత్రీకరణలు జరపాలి. కాబట్టి, సమస్యలను తొందరగా పరిష్కరించుకుందాం,” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. వేతన పెంపు వివాదం ఎలా సద్దుమణిగేనా అనేది తెలుగు సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.