Film Federation President Anil Said Rs 13 crore is pending: తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై కొన్ని రోజులుగా నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి. తాజాగా జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. కొన్ని ప్రతిపాదనలు కొలిక్కిరాకపోవడంతో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
Also Read: Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
‘జరుగుతున్న చర్చలు ఒకలాగ ఉన్నాయి.. బయట ప్రజెంటేషన్ మరొకలా ఉన్నాయి. ఫెడరేషన్ చర్చలకు ఒప్పుకోలేదని నిన్న పెద్ద నిర్మాతలు మీడియాతో చెప్పారు. నాలుగు కండిషన్స్ ఒప్పుకున్నాం.. ఒప్పుకుంటాం అని చెప్పారు. నిన్న మమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. నిన్న ప్రెస్ మీట్‌లో కొందరు ప్రొడ్యూసర్స్ మాపై మాట్లాడారు. రెండు కండిషన్స్ ఒప్పుకున్నారు.. రెండు ఒప్పుకోలేదు అంటున్నారు. సమస్య పరిష్కరించుకోకుండా మధ్యలోనే వాళ్లు వెళ్లిపోయారు. ఆరు నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. పదమూడు కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. నిన్న మాపై మాట్లాడిన ఓ నిర్మాత కూడా 90 లక్షలు బకాయి ఉన్నారు. నిన్నటి నుంచి మా కార్మికులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. వేతనాలు పెంచుతారా.. పెంచితే ఎంత అనేది క్లారిటీ ఇవ్వండి. చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం.. కానీ వారే నాన్చుతున్నారు. అసలు చర్చలు జరుపుతారా లేదా క్లారిటీ ఇవ్వండి. చర్చలు వద్దంటే మేమేం చేయాలో అది చేస్తాం’ అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ హెచ్చరించారు.