Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు తెలిపారు. రీసెంట్ గా మంచు లక్ష్మీతో మూర్తి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో ఓ ప్రశ్న వేయడంతో మంచులక్ష్మీ ఇబ్బంది పడింది. ఆమె వేసుకునే బట్టల గురించి ప్రశ్న వేయడంతో.. ఆమె ఇదే ప్రశ్న మీరు మహేశ్ బాబును అడగగలరా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో అది కాస్తా పెద్ద కాంట్రవర్సీ అయింది. సోషల్ మీడియాలో మొత్తం ఇదే ప్రశ్న గురించి ఆమె మీద ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో మంచు లక్ష్మీ ఈ విషయంపై సీరియస్ గా స్పందించింది.
Read Also : Dragan : ఎన్టీఆర్ డ్రాగన్ అనుకున్న టైమ్ కు రాదా..?
వెంటనే ఫిల్మ్ ఫెడరేషన్ లో జర్నలిస్టు మూర్తిపై ఫిర్యాదు చేయగా.. నేడు ఆయన ఈ వివాదంపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసి క్షమాపణ తెలిపారు. ఆ ప్రశ్న వేయడం వెనక ఉన్న తారతమ్యాల గురించి తాను మాట్లాడదలచుకోలేదని.. మంచు లక్ష్మీ మనసు బాధపడింది కాబట్టి భేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మూర్తి. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మంచు లక్ష్మీ రీసెంట్ గానే ఓ సినిమా ప్రమోషన్ కోసం మూర్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.