Film Workers Strike: 16 రోజుల నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసనలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇందులో భాగంగా నేడు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన కార్మిక సంఘాల నిరసనలను కొనసాగిస్తున్నాయి. ఈ నిరసనలో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సినీ కార్మికులు. అందిన సమాచారం మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫిలిం ఫెడరేషన్ లీడర్స్, యూనియన్ నాయకులు, సినీ కార్మికులు పాలాభిషేకం చేయనున్నారు. ఈ నిరసనలో వేలాదిగా సినీ కార్మికులు తరలి వచ్చారు.
Samsung Galaxy Buds 3 FE: ANC, AI ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE లాంచ్!
ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కార్మిక సంఘాలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. జీతభత్యాలు పెంచాలని అందరికీ తెలుసునని, కానీ ఏదో ఒక వంక పెట్టి 16 రోజులుగా ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కరోజు పని లేకపోయినా బతకలేని వారు 50% మంది ఉన్నారని ఆయన అన్నారు. పది రోజులు కూడా పని దొరకడం లేదని అంటూనే.. సాఫ్ట్ వేర్ కంటే చాలా ఎక్కువ జీతం వస్తుందని అంటున్నట్లు చెప్పుకొచ్చారు.
IT Raids on DSR Group: DSR గ్రూప్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు!
నెలలో 30 రోజులు పని ఉంటే సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ వస్తుంది. కానీ, నెలలో 30 రోజులు పని ఇస్తే మాకు వేజెస్ పెంచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం 15 రోజులుగా పని ఆపడం అన్యాయమని అన్నారు. ప్రొడ్యూసర్ లు షూటింగ్ లు ఆపుతున్నారని చెబుతూనే.. ఈ పద్ధతి ఎక్కడ లేదని, నిర్మాతల గురించి మనం కూడా సానుభూతితో ఆలోచించాలని తమ్మారెడ్డి భరద్వాజ కార్మిక సంఘాలతో మాట్లాడారు. అలాగే నా నుండి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా మీకు ఉంటుందని, అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అప్పుడప్పు అందరూ కలవాలని ఆయన సూచించారు. ఇలా ప్రతి సంవత్సరం ఒక్క రోజు కలిస్తే మన మాట అందరూ వింటారన్నారు.