మెగాస్టార్ చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించాలి. నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను. Also Read:Srinu Vaitla :…
Film Industry Workers Strike: సినీ పరిశ్రమలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. అయినా కానీ కార్మికుల డిమాండ్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇది ఇలా ఉండగా.. నిర్మాత టీ.జి. విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకులపై పెట్టిన కేసులతో పరిస్థితి మళ్లీ మొదటి దశకు చేరింది. నిర్మాతలకు, ఫెడరేషన్ వారికి మధ్య సయోధ్య కల్పించేందుకు కోఆర్డినేషన్ కమిటీ ప్రయత్నాలు చేస్తున్నా, పరిష్కారం కనిపించడం లేదు. Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు…
TG Vishwa Prasad: ప్రస్తుతం సినీ నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాల పెంపు గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినీ నిర్మాతల్లో ఒకరైన విశ్వప్రసాద్ మన తెలుగు సినీ కార్మికులలో టాలెంట్ లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడడంతో ఫిలిం ఫెడరేషన్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది నిర్మాతలలో పలువురు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపద్యంలో టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా స్పందించారు.
తెలుగు సినీ పరిశ్రమలో వేతన పెంపు డిమాండ్ నేపథ్యంలో, నిర్మాత సీ కళ్యాణ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు నిర్వహించిన సమావేశం పరిశ్రమలో కీలక పరిణామంగా మారింది. 30% వేతన పెంపు డిమాండ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించడం, ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన కొందరిపై చర్యలు తీసుకోవడం వంటి సంఘటనలు సినీ పరిశ్రమలో ఉద్రిక్తతలను పెంచాయి. ఈ సమావేశంలో సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. కార్మికులు 30% వేతన పెంపు కోసం…
హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో కలకలం రేగింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో వేతనాల పెంపు కారణంగా షూటింగ్‌లు జరగడం లేదు. 30% వేతనాలు పెంచి ఇచ్చిన వారికి మాత్రమే షూటింగ్‌లకు వెళ్లాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. అలా కొంత మంది వేతనాలు పెంచి షూటింగ్ చేయించుకుంటున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో సినీ కాస్ట్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే ఆ యూనియన్‌లో ఉన్న ఒక సభ్యుడి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాస్ట్యూమర్స్ అసోసియేషన్ సెక్రటరీ నరసింహ,…
Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి బొకే ఇచ్చి, శాలువాతో సత్కరించారు సీఎం రేవంత్. అనంతరం ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ కు, చిరంజీవికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. Read Also : Gowtham Tinnanuri : రామ్ చరణ్ తో మూవీ అందుకే చేయలేదు కొద్ది…
ఫిల్మ్ ఫెడరేషన్ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపింది. ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను…