Tollywood : గత కొద్ది కాలంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తమకు వేతనాలు పెంచాలని, అది కూడా 30% వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ పెంచిన వారికి మాత్రమే షూటింగ్‌కు హాజరవుతామని ప్రకటించింది. అయితే, తదనంతర పరిస్థితులలో ఎవరూ షూటింగ్ జరపకూడదని ఫిలిం ఛాంబర్ ప్రకటించడంతో పూర్తిగా టాలీవుడ్ షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం గతంలోనే చిరంజీవి ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. తర్వాత చిరంజీవి దాన్ని ఖండించారు. అయితే, తాజాగా చిరంజీవి ఈ భేటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రేపు ఉదయం తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో పాటు తెలుగు నిర్మాతలను వేర్వేరుగా కలవనున్నారు. ఫెడరేషన్ తరఫున అన్ని యూనియన్ల ప్రతినిధులను కూడా ఈ భేటీకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
Read Also : Chiranjeevi : నా కెరీర్ లో స్టాలిన్ ఎంతో ప్రత్యేకం.. చిరు ఎమోషనల్
అటు సినీ కార్మికులకు, ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలుగకుండా మెగాస్టార్ చిరంజీవి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర భాషల సినీ పరిశ్రమల నుంచి కూడా ఆయన సమాచారం సేకరిస్తున్నారని అంటున్నారు. ఆయా భాషలలో ప్రస్తుతం వేతనాలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించి, ఇక్కడ అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా వేతనాలపై ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఎలా చెబితే అలా వింటామని ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు గతంలోనే ప్రకటించారు. కాబట్టి, ఈ సమస్యకు రేపటితో చెక్ పడే అవకాశం ఉంది.
Read Also : Udaya Bhanu : ఎక్కడ తిట్టాలో వాళ్లే చెప్తారు.. టీవీ షోలపై ఉదయభాను సెటైర్లు..