న్యూ ఓర్లీన్స్‌లో దాడికి పాల్పడ్డ యూఎస్ పౌరుడు, మాజీ ఆర్మీ సైనికుడు షంసుద్-దిన్ జబ్బార్‌కు సంబంధించిన వీడియోను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. న్యూఇయర్ సందర్భంగా న్యూ ఓర్లీన్స్‌లో ట్రక్కుతో ఢీకొట్టి 15 మంది ప్రాణాలు తీసుకున్నాడు. మరో 30 మంది గాయపడ్డారు. అయితే దాడికి ముందు జబ్బార్.. మెటా ఏఐ గ్లాసెస్‌తో రికార్డ్ చేసిన వీడియోను ఎఫ్‌బీఐ విడుదల చేసింది.
అయితే ట్రక్కుపై ఐసిసి జెండాను అధికారులు గుర్తించారు. ఇతడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం నుంచి ప్రేరణ పొందినట్లుగా గుర్తించారు. ట్రక్కును అద్దెకు తీసుకుని న్యూఇయర్ వేడుకలపైకి దూసుకొచ్చాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. అయితే నిందితుడి చుట్టూ మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయి. అవి పేలకుండానే పోలీసులు అతన్ని పట్టుకుని తుదిముట్టించారు. లేదంటే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేది.
అక్టోబర్ 31, 2024న ఫ్రెంచ్ క్వార్టర్‌లో జబ్బార్ సైకిల్ తొక్కుతూ ఆ ప్రాంతాన్ని వీడియో తీశాడు. అలాగే పరిసరాలను సర్వే చేశాడు. ముందుగానే ఆయా స్థలాలను అధ్యయనం చేశాడు. కొన్ని వారాల తర్వాత తన మెటా గ్లాసెస్ రికార్డ్ చేసే సామర్థ్యాన్ని పరీక్షించడానికి అద్దెకు తీసుకున్న ఇంటిలో అద్దంలోకి చూస్తున్నట్లుగా రికార్డ్ అయింది. జనవరి 1న స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:53 గంటలకు జబ్బార్ బోర్బన్ స్ట్రీట్, సెయింట్ పీటర్స్ స్ట్రీట్ కూడలిలో నీలిరంగు కూలర్ లోపల మొదటి ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని ఉంచడం కనిపించింది. కూలర్‌ను తెలియకుండానే పాదచారులు తరలించారు. ఇది ఓర్లీన్స్ స్ట్రీట్‌లో గుర్తించారు.
స్థానిక కాలమానం ప్రకారం దాదాపు తెల్లవారుజామున 2:20 గంటలకు జబ్బార్ రెండవ బాంబును బోర్బన్, టౌలౌస్ స్ట్రీట్స్‌లో ‘‘బకెట్-శైలి’’ కూలర్‌లో ఉంచాడు. అనంతరం జబ్బార్ గవర్నర్ నికోల్స్ స్ట్రీట్‌లో ట్రక్కు నడుస్తున్నట్లు కనిపించింది. అనంతరం ట్రక్కుతో ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. కైరో, కెనడా పర్యటనల తర్వాత ఈ దాడికి ప్రేరణ పొందినట్లుగా తెలుస్తోంది.