త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమిఫైనల్ గా భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు తిరిగి తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా ఒక రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారాన్ని కాపాడుకోవడం ఆపార్టీకి కత్తి మీద…
లఖింపుర్ ఖేరిలో ఘటనల మీద కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని మోడీ న్యాయం చేయాలని, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని, ఆయన కుమారుడిని అరెస్టు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్షపడాలని ఈ దేశంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు.. లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర…
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె… వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఎండగట్టారు.. ‘రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’…
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు, మరో ముగ్గురు లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి యూపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకులను అనుమతించారు పోలీసులు. లఖింపూర్ ఖేరీ వెళ్లేందుకు అనుమతి ని నిరాకరిస్తూ ప్రియాంక గాంధీ ని సోమవారం అరెస్టు చేసారు పోలీసులు. ఈరోజు ఉదయం, రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ , పంజాబ్…
ఉత్తర ప్రదేశ్లో లఖీంపూర్ ఖేరి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. లఖీంపూర్ ఖేరీ లో నిరసనలు చేపడుతున్న రైతుల మీదకు కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రా కుమారుడు కారుతో యాక్సిడెంట్ చేశాడని, ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందారని, అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు మృతి చెందారని ఆరోపణలు. దీంతో కేంద్రమంత్రి ఆశిశ్ మిశ్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు లఖీంపూర్ ఖేరీ వైపు ఎవర్నీ వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే, లఖీంఫూర్ ఘటన…
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేస్తున్నారు. అటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
ఉత్తరప్రదేశ్లో హింస చెలరేగింది. లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండలో 8 మంది రైతులు మృతిచెందారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లడంతో… ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాన్వాయ్ ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అల్లర్లలో మరో నలుగురు మృతి చెందడం విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్ లఖీమ్పూర్ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరయ్యారు. వీరి…
హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు…
చాలా కాలంగా పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ కుమ్ములాటల కారణంగా అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. రాజీనామా చేసిన తరువాత ఢిల్లీ వెళ్లివచ్చిన ఆయన కాంగ్రెస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేదని చెప్తూనే, వచ్చే ఎన్నికల్లో సిద్ధూని ఒడించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరో 15 రోజుల్లోనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీని స్థాపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా…
గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై…