వానాకాలపు పంట ప్రతీ గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని…తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వర్షానికి తడిసిన పంటను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని…రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ రైతు బంధు పార్టీ అని…… బీజేపీ రైతులపై బందూకులు ఎత్తిన పార్టీ అని ఫైర్ అయ్యారు. రైతును రాజుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. హుజూరాబాద్ లో ఐదు వేల ఇళ్లు కట్టించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. స్వంత జాగా ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించారు.