కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.. అయితే, భారత్ బంద్ ఫెయిల్ అయ్యిందని.. రైతులంతా ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉన్నారని తెలిపారు.. బీజేపీ ఎంపీ, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఛాహార్.. విపక్షాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్ ఫెయిల్ అయ్యింది.. ఎక్కడా బంద్ ప్రభావం కనిపించలేదన్న ఆయన.. రైతు ముసుగులో కాంగ్రెస్, విపక్షాలు…
సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. రైతు రుణ మాఫీ , రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్…
ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. కాగా, ఈరోజు సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల…
అమరావతి. ఆంధ్రుల ఆశాకిరణంగా నిలిచిన నగరం. నిలుస్తుందని అనుకున్న పట్టణం. కానీ.. రాజకీయాల్లో చిక్కుకుని.. భవిష్యత్తు ఏంటో తెలియక సతమతమవుతున్న నగరం. ఇందులో.. ఎవరినీ తప్పుబట్టడం కానీ.. మంచి అనడం కానీ.. ఎంత మాత్రం లేదు. కానీ.. లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో తెలియక.. నిత్యం అక్కడ దీక్షల పేరుతో పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతుల భవిష్యత్తు ఏంటి.. అన్నదే ఇక్కడ చర్చనీయాంశం. గతంలో టీడీపీ ఉన్నప్పుడు భూములు సేకరించింది. అమరావతిపై ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో ప్రచారం చేసింది. దేశానికే…
వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ నుంచి గతంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అటు ఉత్తర ప్రదేశ్ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేశారు. ఇప్పుడు రైతులు బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. కర్నాల్ లో రైతులు రోడ్డు మీదకు చేరుకొని నిరసనలు…
టమోటా ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. కిలో ధర ఏకంగా రూపాయికి పడిపోయింది.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో దారుణంగా పడిపోయింది టమోటా ధర.. ఇవాళ కిలో టమోటా ఒక్క రూపాయికే అమ్ముడు పోయింది.. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.. వారికి మద్దతుగా రైతు సంఘం ధర్నా చేపట్టింది.. టమోటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ లో ధర్నా చేశారు అన్నదాతలు.. ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని…
కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వాటితో దీర్ఘకాలంలో రైతులకు చాలా మేలు జరుగుతుందని చెబుతూ వస్తోంది.. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నా.. మొదట్లో చర్చలు జరిపినట్టే జరిపి.. ఆ తర్వాత లైట్ తీసుకుంది కేంద్రం.. అయితే, ఉన్నట్టుండి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళలన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు వరుణ్ గాంధీ… రైతుల బాధలను కేంద్రం…
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం.. అసలు రైతును మించిన గురువే లేడని వ్యాఖ్యానించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతరాష్ట్ర అరటి మార్కెట్ పరిశీలించిన ఆయన.. అరటి గెలలు అమ్ముకుంటున్న రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును మించిన గురువు లేడన్నారు.. నేను 12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నానని.. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు,…
అప్పుడప్పుడు మత్స్యాకారుల వలకు ఆరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన అరుదైన చేపలను అధికమొత్తానికి అమ్ముతుంటారు. అయితే, కొన్ని రకాల చేపలు మాత్రం భయపెడుతుంటాయి. అవి అరుదైన చేపలు మాత్రమే కాదు.. డేంజర్ కూడా. విదేశాల నుంచి దేశానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన అక్వేరియం చేప సక్కర్ క్యాట్ఫిష్ చేపలు ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వ్యాపించాయి. వేగంగా ఈ చేపలు వాటి సంతతిని పెంచుకుంటాయి. అంతేకాదు, ఈ చేపల శరీరంపై నల్లని చారలు…