మినుములతో పాటు ఇవి సాగు చేయండి.. రైతులకు మంత్రి సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి వచ్చింది.. అయితే, ఏ పంట పడితే అది వేసి.. నష్టాలు చవిచూడొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఈ యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని కోరిన ఆయన.. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300గా ఉందని వెల్లడించారు.. మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు నిరంజన్ రెడ్డి.
ఇక, మినుముల కొనుగోలుకు అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి… దేశ వ్యాప్తంగా మినుములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ సంస్థ నాఫెడ్ ను సంప్రదించిందని వెల్లడించారు.. నిన్ననే రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి నాఫెడ్ సంస్థ లిఖితపూర్వక హామీ ఇచ్చిందని.. మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని సూచించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి..
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు